బెజ్జూరు మండలంలోని సిద్దాపూర్ సమీపంలోని మత్తడి స్ప్రింగన కట్టకు రైతుల ఏకమై మరమ్మతులు చేశారు. కొన్నేళ్లుగా మత్తడి స్ప్రింగన కట్ట మరమ్మతులు లేకపోవడంతో పంట పొలాలకు సాగునీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు చెప్పినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదని రైతులు అన్నారు. దీంతో రైతులందరూ ఏకమై ఇసుక సంచుల్లో నింపి నీటిని పంట పొలాలకు వచ్చేలా మరమ్మతులు చేశారు. అధికారులు చేయని పనిని రైతులు చేశారని స్థానికులు తెలిపారు,