గోకవరంలోని 13వ రేషన్ షాపు వద్ద కూటమి నాయకులు గురువారం 709 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను నాయకుల చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్ లో అవకతవకలు అరికట్టేందుకే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు పనిచేస్తుందని కూటమి నాయకులు అన్నారు.