కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ కార్యలయం ఎదుట సోమవారం అధికారులు న్యాయం చేయాలంటూ డ్వాక్రా మహిళలు నిరసన చేపట్టారు. కమలాపురం వీవో3 డ్వాక్రా గ్రూపుల్లో గోల్ మాల్ జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.వీవో 3 ఆనిమేటర్ మావద్ద లోన్ కావాలన్నా శ్రీనిధి, పొదుపు పుస్తాకాలు రాయలన్నా మరియు ఆడిట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదంటూ మహిళల ఆవేదన చెందారు.తమ డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో ప్రతి గ్రూపు నుంచి రూ.వెయ్యి కట్టాలంటూ ఆనిమేటర్ హైమావతి వాయిస్ మెసేజ్ పెట్టిందన్నారు.