ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం 8 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండు రవితో పాటుగా మరో ఏడుగురుపై కేసు నమోదు చేశారు ఒంగోలు డిఎస్పీ ఆఫీస్ వద్ద అనుమతి లేకుండా నిరసన ధర్నా నిర్వహించిన మీదుగా వారిపై కేసు నమోదు చేసి అనంతరం 41 నోటీసు ఇచ్చి వారిని విడుదల చేశారు అయితే ఆదివారం ఉదయం 45వ డివిజన్ మారుతి నగర్ గణేష్ వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన గొడవకు నిరసనగా వైసీపీ నేతలు స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు