రహదారి భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని పెబ్బేరు ఎంవీఐ వాసు దేవారావ్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషా పెబ్బేరులోని వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్టు పెట్టుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.