సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ, ఇతర పూజారులతో కలిసి ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ, అభిషేకం పూర్తయ్యాక తిరిగి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.