విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం.ఆంక్షలకి తూట్లు పొడుస్తు టికెట్ వ్యవస్థను ఏర్పాటు చేసిన నిర్వహకులు.గాజువాక లోని లంక గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన.. భారీ గణనాధుడు పేరిట వ్యాపారం.దర్శనాలు నిలిపివేసిన గాజువాక పోలీసులు.దర్శనం టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అమ్ముతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. దర్శనాలను నిలిపివేశారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి వసుళ్ళకు పాల్పడకూడదని నగర పోలీస్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని తూట్లు పొడుస్తూ గణేష్ మండపాలు వద్ద కమర్షియల్ స్టాల్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు