చందానగర్ శాంతినగర్ కాలనీలో 18 కోట్ల వ్యయంతో పటేల్ చెరువు అలుగు నుంచి గంగారం చెరువు వరకు చేపడుతున్న ఆర్సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరికే పూడి గాంధీ శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. డ్రైనేజీ నాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.