విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసి లాబాల్లోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికోసం ఈవోఐ పేరుతో కొన్ని విభాగాలను నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ భాగస్వామ్యాన్ని ఎంచుకుంటున్న విధానాన్ని తప్పుపడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలు కార్మికులను నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్నాయని టిడిపి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గాజువాక టిడిపి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపికి కోవటలుగా మారిన కొంతమంది నాయకులు ప్రజలలో స్టీల్ ప్లాంట్ పట్ల అభద్రతను సృష్టిస్తున్నారని అన్నారు.