వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్లు సంక్షేమ పథకాలను పక్కనపెట్టి నియంతలా వ్యవహరించారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ప్రజలకు ఎవరు మోసం చేశారో తెలుసా అని. మోసం చేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు అన్నారు. నూతన సంస్కరణలు తీసుకొస్తామని చెబుతున్న వైసిపి మీ ఐదేళ్ల హయంలో ఏ సంస్కరణలు తీసుకొచ్చారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని వెంకటేశ్వర రావు సూచించారు.