ఏనుగుల వలన స్టెప్పు పైన రైతులను ఆదుకోవాలని కొమరాడ మండల సిపిఎం కార్యదర్శి కొల్లి సాంబమూర్తి కోరారు. శుక్రవారం కోటిపాము ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకొని రెస్క్యూ వాహనం దగ్గర బాధితులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గుమ్మడ కోటిపాము గ్రామాలకు చెందిన రైతుల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయన్నారు. ఏనుగులను జూకి లేదా అడవికి తరలించాలాన్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.