ఉద్యోగులకు రావలసిన కరువు భత్యం వెంటనే చెల్లించాలని ఏపీటిఎఫ్ నాయకులు కోరారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా పేరివిసన్ బకాయిలు, నూతన పే కమిషన్ మొదలైన అనేక బకాయిలు చాలా కాలంగా ఆగిపోయి ఉన్నాయన్నారు. దీంతో అనేకమంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తన కుటుంబాలను భారంగా నడుపుతున్న సందర్భాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించా