ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం, గని ఆత్కూర్ గ్రామానికి చెందిన 54 ఏళ్ల దామినేని శ్రీనివాసరావు, 50 ఏళ్ల దామినేని రజిని కుమారి గా గుర్తించారు.