ఏలూరు నగరంలోని ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న కొంతమంది దాడి చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అనంతరం పనిచేయని వంద రూపాయల నోటును ఇవ్వ చూడగా బంక్ సిబ్బంది నోటును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి బంకు గుమస్తాపై దాడికి యత్నించాడు.బంకు యాజమాన్యం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.