చేగుంట మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం 4 గంటల నుండి కిలోమీటర్ కట్టిన రైతన్నలు. గంటలు గడిచిపోతున్న యూరియా మాత్రం దొరకడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం నాలుగు గంటలకు పొలం పనులు అన్ని మానేసుకుని క్యూ కట్టమని అయినా కూడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసి మూడు నెలలు గడుస్తున్నా, కలుపు కలిసి యూరియా చల్లుదామంటే యూరియా దొరకడం లేదని వేసిన పంట కూడా నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులకు యూరియా సరఫరా చేసే విధంగా చూడాలని వారు తెలిపారు