ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం గ్రహణం తర్వాత తెరుచుకుంది.ఆదివారం మధ్యాహ్నం ఆలయ ద్వారం మూసివేసిన అర్చకులు సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని పలు ఆలయాలు మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాలను తెరిచారు.