సౌర విద్యుత్తు వినియోగంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాల్లో విద్యుత్ శాఖ ఇంజనీర్లకు సౌర విద్యుత్ ను విస్తృత పరచాలని గొప్ప ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 'PM - సూర్య ghar : ముఫ్త్ బిజిలి యోజన' పైన రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనప కలెక్టర్ పింకేష్ కుమార్ పాల్గొన్నారు.