జలజీవన్ మిషన్ కింద ఓర్వకల్లు మండలం కనమడకల గ్రామంలో మంగళవారం రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న 90 వేల లీటర్ల హెచ్ఎస్ఆర్ ట్యాంక్ మరియు పైప్‌లైన్‌కు గ్రామ నాయకులు సుధాకరయ్య, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో భూమిపూజ జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడనుందని తెలిపారు.