నానో యూరియాపై రైతులకు అవగాహన సదస్సు శ్రీకాళహస్తి మండలం తొండమాన్ పురంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారి రమేశ్ రెడ్డి నానో యూరియా, నానో డీఏపీ ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నానో యూరియా, నానో డీఏపీ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. యూరియాకు డిమాండ్ పెరుగుతుందని, ఈ నేపథ్యంలో రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలని సూచించారు.