మంత్రాలయం మండలం మాధవరం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంకటప్రసాద్, వెంకటరమణ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి రికార్డులు లేకుండా ఆంధ్రకి ఇనుము పదార్థాలు రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలను మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్కు అప్పగించారు. ఎస్సై విజయ్ కుమార్ లారీ యజమానులపై కేసు నమోదు చేశారు.