Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 29, 2025
రాజవొమ్మంగి మండలంలో జ్వరాల కేసులు పెరుగుతున్నందున ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సుష్మా శుక్రవారం సూచించారు. వర్షాకాలం కనుక తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. PHCలో ప్రతిరోజూ వందకు పైగా ఓపీలు నమోదు అవుతున్నాయన్నారు. వీటిలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ అన్నారు. చెలమ నీరు (గెడ్డల్లోని నీరు) తాగవద్దన్నారు. జ్వరం వస్తే ఆస్పత్రికి రావాలని, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.