తండ్రి పేరున ఉన్న పట్టా భూమిని పెద నాన్న, ఆయన కొడుకు కబ్జా చేశారు. కొలిసి భాగం పెట్టించండని కాళ్ళు అరిగేలా రెవిన్యూ అధికారుల చుట్టు తిరుగుతున్న మహిళకు, రెవిన్యూ అధికారులు న్యాయం చేయకుండా మోసం చేస్తున్నారు. డబ్బు అధికార బలం ఉన్న సీతప్పకే రెవిన్యూ సిబ్బంది వత్తాసుపలికి తనకు తీరని న్యాయం చేస్తున్నారు. ఇక ఎప్పటికి నాకు న్యాయం జరగదు. అందుకే అధికారుల సమక్షంలోనే చచ్చి పోవడానికి విషం తాగానని ఓ బాధితురాలు ఆరోపించడం గురువారం అన్నమయ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. మదనపల్లె మండలం, కొత్తవారిపల్లె గ్రామం, గాజులవారిపల్లెలో ఉంటున్న కృష్ణప్ప కుమార్తె(33)కు, రామసముద్రం మండలం, బలిజిపల్లెలో