మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద బుదవారం మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని గత 40 సంవత్సరాల నుండి ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో ఉద్యమాలకు తలొగ్గిన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయనీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతుంటే కుంటి షాకులు చెబుతున్న ప్రభుత్వాలు ప్రభుత్వ వైఖరిని బిసి సమాజం ముందు ఎండ కడతామనీ అన్నారు.