విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈనెల 25 తేదీన జరగబోయే ఛలో కలెక్టరేట్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయం ఆవరణంలో వారు మాట్లాడుతూ.. ప్రధానంగా ఆదోని పట్టణంలో మెడికల్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలని , అదేవిధంగా మైనార్టీ గురుకుల కళాశాలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.