పోలీసుల పహారాలో యూరియా టోకెన్ల పంపిణీ మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని రైతు వేదికలో గురువారం మధ్యాహ్నం రైతులకు పోలీసుల పహారాలో యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. యూరియా ఇబ్బందులు ఎక్కువ కావడంతో రైతు వేదికలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రైతు వేదికలకు వచ్చిన 351 మంది రైతులకు టోకెన్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయ అధికారి గంగమల్లు తెలిపారు. మళ్లీ సోమవారం యూరియా ఎరువుల పంపిణీ చేపట్టనున్నట్లు ఈ సందర్బంగా ఆయన వివరించారు.