గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, పోలీసులకూ, ప్రజలకూ పలు సూచనలు చేశారు.ఎస్పీ మాట్లాడుతూ....వినాయక మండపాల అనుమతుల కోసం ఎలాంటి రుసుములు అవసరం లేదని, https://ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారులు చిరునామా, కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జనం సమయం, వాహనం వంటి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. స్థానిక పోలీసులు పర