ఎచ్చెర్ల సమీపంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు యువత నాయకుడు మెండ దాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. అమరావతి రాజధాని, రైతుల పట్ల ఆ ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడటం దారుణమన్నారు. ఆందోళన చేసి సాక్షి కార్యాలయానికి తాళం వేశారు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.