బాలానగర్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 118 లో ఉన్న పెద్ద చెరువు అసైన్డ్ భూమిలో వారాహి ఇన్ఫ్రా డెవలపర్స్ కోసం ప్రభుత్వ అనుమతులు ఇచ్చారని అధికారుల తప్పిదాల వల్ల ఇప్పుడు చెరువు కింద రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా అధికారులు తప్పిదాలు చేయడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత వివిధ శాఖల జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.