సోమవారం రోజున ఉప్పల్ మినీ శిల్పారామం లో నవరాత్రి బతుకమ్మ మరియు దసరా సంబరాలు మరియు సారీస్ అఫ్ ఇండియా మేళ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. పోచంపల్లి, గుజరాత్ బందీని, బీహార్ భాగల్పూరి, సోలాపూర్, హ్యాండ్ బ్లాక్ , తస్సార్ బనారస్ మొదలైన చేనేత చీరలు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత కళాకారులు ప్రోత్సహించవలసినదిగా శిల్పారామం అధికారులు కోరారు.