కోతుల బెడద నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని కోరుతూ నేడు శనివారం రోజున ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిష్ట్) మండల కార్యదర్శి గ్యానం వాసు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కోతులు ఇండ్లలో చొరబడి నిత్యవసర వస్తువులను తీసుకెళుతున్నాయని, అలాగే ప్రజల పైకి కూడా దాడి చేస్తున్నాయని కావున వీటిని కట్టడి చేసి అటవీలో వదిలేయాలని కోరారు.