బాపట్ల జిల్లా పరుచూరి గ్రామంలోని నల్లబెర్లి పొగకు కొనుగోలు కేంద్రాలను ఏపీ మార్క్ ఫైడ్ చైర్మన్ బంగారు రాజు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కుఫైడ్ సంస్థ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫైడ్ జి ఎం శ్రీనివాసరావు జిల్లా మేనేజర్లు పాల్గొన్నారు.