అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ మాట్లాడుతూ.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.