ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆధునికంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు కేటాయిస్తామని.. పారదర్శకంగా సద్వినియోగం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియంను శనివారం సాయంత్రం 5గంటలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురాతన పాఠశాల తరగతులను పక్కనున్న నూతన భవనంలోకి వారం రోజుల్లోగా తరలించాలన్నారు.