ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో విద్యార్థిని విద్యార్థులకు బుధవారం ఎయిడ్స్ కంట్రోల్ నిర్వహణ అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని విద్యార్థులకు వారు తెలిపారు. కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం అధిక భాగస్వాములతో సెక్స్లో పాల్గొనడం వంటివి చేస్తే ఎయిడ్స్ వ్యాధి సోకుతుందని ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఈ విషయంలో సిగ్గుపడవలసిన అవసరం లేదని అధికారులు విద్యార్థులకు తెలిపారు.