శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి గోవిందు, జిల్లా కార్యదర్శి రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని దీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వైద్యాన్ని ప్రాధాన్యంగా చూస్తామని చెప్పే ప్రభుత్వాలు అదే రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించాలనుకోవడం దారుణమని తెలియజేశారు.