కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ ఎం. శిరీషదేవి అన్నారు. రాజవొమ్మంగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో బుధవారం స్త్రీ శక్తి పధకంలో మహిళలలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం విజయోత్సవ సభను మండల కార్యదర్శి ఎం. కేశవ్ అధ్యకతన నిర్వహించారు. ఈ సందర్బంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతా CM చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్కువ కాలంలో పారదర్శకంగా అమలు చేశారన్నారు.