పెన్షన్ పంపిణీ గత నెలలో చేసిన విధంగానే పెన్షన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పూర్తి పెన్షన్ మొత్తం ఇప్పటికే గ్రామ/ వార్డు సచివాలయాలకు విడుదల చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1 వ తేదీన అన్ని పెన్షన్లు విడుదల చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ పంపిణీ గత నెలలో ఏ మొత్తంలో తీసుకున్నారు అదే మొత్తంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎలాంటి మార్పులు లేని విషయాన్ని గమనించాలని సూచించారు. 15,000/-, 10,000/-, 6,000/-, 4,000/- యధావిధిగా పాత పెన్షన్ నగదు పంపిణీ ఉంటుందన్నారు.