ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తల కుటుంబాలకు జనసేన నాయకులు మంగళవారం ఇన్సూరెన్స్ నగదును పంపిణీ చేశారు. ప్రమాదాలను మృతి చెందిన రాము, కృష్ణ కిషోర్ కుటుంబాలను ఆదుకుంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు పంపిణీ చేసినట్లు ఇంచార్జ్ మనోజ్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ హాజరయ్యారు. గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారికి ఇన్సూరెన్స్ నగదును వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేసినట్లు జనసేన నాయకులు తెలిపారు.