ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర పల్లె గ్రామంలో వెంకటరత్నం, యేసు రత్నం, చెన్నమ్మ లపై సురేష్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇంటి ముందు శుభ్రపరచుకునే విషయంలో కొంతకాలంగా సురేష్ మరియు బాధితుల కుటుంబానికి పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుందని ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్లుగా బుధవారం రాత్రి 7 గంటలకు ఎస్సై రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దళిత సంఘాలు కూడా సురేష్ ముగ్గురు వ్యక్తులపై దాడి చేయడంపై అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు.