పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం లో ప్రభుత్వ వైద్యులు కిరణ్ కుమార్ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో చిన్నారులకు పెళ్లిళ్లు చేయడం వల్ల ప్రమాదం అంటూ పేర్కొన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల వెంటనే గర్భం దారిస్తే అటు తల్లికి ఇటు బిడ్డ కూడా ఎంతో ప్రమాదం తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కూడా తమ సిబ్బంది చేత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.