తుగ్గలి మండలంలోని ముక్కెళ్ల గ్రామంలో గురువారం కురిసిన వర్షానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ దుర్ఘటనలో రైతు అరవ బాలుకు చెందిన ఎద్దు మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ. 60,000 ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో రైతు కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.