సమగ్ర యాజమాన్య పద్ధతులతో సాగు చేయడం వల్ల రైతులకు ఆదాయం చేకూరుతుందని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు అన్నారు. గురువారం తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్ద గుంట గ్రామంలో పీఎం ఆర్కే వి వై పథకం ద్వారా తిరుపతి జిల్లా వనరుల కేంద్రం వారు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగాజిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు మాట్లాడుతూ సాగు పద్ధతుల్లో,సస్యరక్షణ పద్ధతులలో మగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలియజేశారు.కేవలం రసాయన ఎరువులనే వాడకుండా సేంద్రియ ఎరువులు,జనుము జీలుగ వంటి పచ్చ రొట్టె ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువ