రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడింది లేదని పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ధ్రువ కుమార్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని చింతలమడుగు పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు ఉల్లి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రైతుల కళ్ళల్లో కష్టాలు, కన్నీరే కనపడుతున్నాయని చెప్పారు. ఉల్లి పంటకు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు.