బాపట్లలోని ప్రైవేట్ రిసార్ట్స్, లాడ్జిలలో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జిలలో బస చేస్తున్న వారి వివరాలను సేకరించి రికార్డులను పరిశీలించారు. పట్టణ సీఐ మాట్లాడుతూ.. లాడ్జిల్లో ఉండే వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు కల్పించరాదని హెచ్చరించారు.