అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆనేపురం జీపీ పరిధిలోని మెగ్యా తండాకు చెందిన భూక్య వెంకన్న (35) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడగా భార్య పుట్టింటికి వెళ్లింది.కాగా తన ఆటోలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది