ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేరడిగొండ లోని పలు కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. మోకాళ్ళ లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉధృతిగా ప్రవహిస్తున్న వాంకిడి వాగులను, చెక్ డ్యాం లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న అత్యంత భారీ వర్శాల కారణంగా బోథ్ నియోజకవర్గ ప్రజలెవరు కూడా బయటకు రావొద్దని, వాగు వంకలకై ఎవరు వెళ్ళొద్దని అత్యవసరమైతే తప్ప బయట వెళ్ళొద్దని అన్నారు.