నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు సీఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులు తమ నేర వృత్తిని విడిచిపెట్టి ప్రశాంత వాతావరణంలో జీవితాన్ని గడపాలని సూచించారు. నేరాలు చేయడం పట్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారని, కుటుంబంలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఐ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలన్నారు.