రాజాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలపై మండిపడ్డారు. బాలనగర్ మండల కేంద్రంలో పెద్ద చెరువు సర్వే నెంబర్ 118 లో వారాహి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఎలాంటి భూమిని కబ్జా చేయలేదు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కావాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో జిల్లా కలెక్టర్కు ఒత్తిడి తెస్తున్నారు అని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు విమర్శించారు.