పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా సోమవారం నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్దిదారులకు రూ.42,73,515 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కల్లూరు అర్బన్ పరిధిలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా నిలుస్తుందనీ, ప్రతి అర్హుడూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.