స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ మరియు జగ్గంపేట ఐసీడీస్ ప్రాజెక్ట్ అధికారిణి M. పూర్ణిమ అధ్యక్షతన జగ్గంపేట స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామ స్థాయి బాలల సంక్షేమ మరియు పరిరక్షణ కమిటీ అధికారులకు మండల స్థాయిలో బాలల పరిరక్షణ మరియు బాలల చట్టాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ MPDO చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్ములించ వలసిన బాధ్యత గ్రామ స్థాయి కమిటీ అధికారులందరికి ఉందని, బాల్యవివాహాలు సామాజిక రుగ్మత కాబట్టి బాల్య వివాహాలు గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.